గతంలో పట్టాలు పొందిన అర్హులైన దళిత కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలి
సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని శాంతినగర్ కాలనీలో గతంలో సుమారు 202 మంది దళిత కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. అనంతరం సుమారు 11 ఎకరాల భూమిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, నర్సింగ్ కాలేజీ, అంబేద్కర్ భవనం మరియు సఖీ కేంద్రం నిర్మించడం జరిగింది. ఆ సమయంలో పట్టాలు పొందిన కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు, నిర్మించిన ఇళ్లు తాళాలు వేసి నిరుపయోగంగా ఉండటంతో అక్కడ మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు గతంలో పట్టాలు పొందిన కుటుంబాల రికార్డులను పరిశీలించాలి అర్హులైన దళిత కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తూ న్యాయబద్ధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలి ఖాళీగా ఉన్న ఇళ్ల వద్ద అసాంఘిక కార్యకలాపాలను అరికట్టి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలి ఈ సమస్యపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిశీలించి. అర్హులైన దళిత పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల తరపున కోరుతున్నాను.