టస్కా సభ్యురాలిగా ఒగ్గు లక్ష్మీ యాదవ్ నియామకం
ఎల్లారెడ్డిపేట మండల (టస్కా) సభ్యురాలుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు ఒగ్గు లక్ష్మి యాదవ్ ను నియమిస్తూ టస్కా(తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య లేఖ నెంబర్ 55 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. టస్కా సభ్యురాలిగా వయోవృద్ధుల సంరక్షణ, తల్లిదండ్రులను పోషించని కుమారులకు కౌన్సిలింగ్ నిర్వహించే కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.వయోవృద్ధుల సంరక్షణ చేయని కుమారులు పోలీస్ స్టేషన్ కు వృద్ధులు వచ్చి ఫిర్యాదు చేస్తే టస్కా సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఓగ్గు లక్ష్మీ యాదవ్ తో పాటు మరో ముగ్గురు సభ్యులు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఒగ్గు లక్ష్మి యాదవ్ మాట్లాడుతూ తనను టస్కా సభ్యురాలిగా నియమించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు జనపాల శంకరయ్య కు, రాష్ట్ర కార్యదర్శి చేన్నమాధవ్ ని రామరాజుకు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ కు, కోశాధికారి దొంత దేవదాసు కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.