IV3 NEWS
krishnadaram198
Reporter
Sirisilla • రాజన్న సిరిసిల్ల
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
నర్సింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు సిరిసిల్ల టౌన్ సీఐ ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రాజు, అభిషేక్, విజయ్ పాల్గొన్నారు.
30 Oct 2026|07:00 PM IST|Sirisilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261030-000024