IV3 NEWS
IV3 NEWS
ప్రతి దృశ్యం, సమాజ హితం
Sign in
పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించాలి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
IV3 NEWS
Local News
IV3 NEWS
krishnadaram198
Reporter
Sirisilla • రాజన్న సిరిసిల్ల

పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించాలి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి

రాజన్న సిరిసిల్ల జిల్లా అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం . ఐద్వా జిల్లా వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది

వర్క్ షాప్ అనంతరం

పెరుగుతున్న నిత్యవసర ధరల అరికట్టాలని ప్రభుత్వం వెంటనే రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యవసర సరుకుల ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

రాష్ట్రంలో ఏర్పడిన ఏలినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురవడం జరిగింది

దీనిని ఆసరా చేసుకుని దళారులు పెద్ద మొత్తంలో నిత్యవసర సరుకులను బ్లాక్ చేసేసి ఎక్కువ ధరలకు అమ్మడం జరుగుతుంది గత రెండు మాసాల కింద ఉన్నటువంటి బియ్యం ధర కింటాలుకు 12000 రూపాయలు చేరుకొని కార్మికుడు సామాన్యుడు మధ్యతరగతి ప్రజలకు రెండు పూటలా కడుపునిండా భోజనం చేయలేని పరిస్థితి తయారయింది

కార్మికుల వేతనాలు రోజురోజుకు దిగజారి పోతుంటే నిత్యవసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి అయినా కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా.ధరల నియంత్రణను అరికట్టకుండా దళారీలకు అండగా నిలుస్తున్నది. వెంటనే ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలను అరికట్టాలని బ్లాక్ మార్కెట్ నిర్వహిస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం 14 రకాల వస్తువులను ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో. జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల. జిల్లా అధ్యక్షురాలు ఆడేపూ రజిత. సిఐటియు జిల్లా నాయకురాలు సూరం పద్మ. ఐద్వా జిల్లా నాయకురాలు గట్ల సప్న లలిత . మాధవి. తదితరులు పాల్గొన్నారు

29 Oct 2026|08:00 PM IST|Sirisilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261029-000020

You're all caught up ✨

Back to latest feed