IV3 NEWS
IV3 NEWS
ప్రతి దృశ్యం, సమాజ హితం
Sign in
మోదీ పై వ్యాఖ్యలకు నిరసనగా, ఖర్గే దిష్టిబొమ్మ దగ్దం
IV3 NEWS
Local News
IV3 NEWS
VIGNYATHRI IRUKULLA
VIGNYATHRI IRUKULLA
Reporter
Sircilla • రాజన్న సిరిసిల్ల

మోదీ పై వ్యాఖ్యలకు నిరసనగా, ఖర్గే దిష్టిబొమ్మ దగ్దం

సిరిసిల్ల : మోదీ పై ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా, బిజెపి శ్రేణులు ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై ధర్నాకు దిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌక్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్దం చేయడానికి బిజెపి శ్రేణులు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మను అక్కడి నుండి తొలగించారు. ఈ సందర్భంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం వారు మరో దిష్టిబొమ్మలు తీసుకుని వచ్చి అక్కడే దహనం చేశారు. తరువాత రొడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మల్లికార్జున కర్గే మరియు కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నిరసనకారులను సముదాయించి ధర్నాను విరమింప చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ . . . మల్లికార్జున కర్గే బీహార్ లోని పాట్నాలో మోడీ జాయేగా , ఉస్కే బాప్ జాయేగా అన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మోడీకి కర్గే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎస్ ఐ ఆర్ మరియు ఈవీఎంలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నికలలో గెలవలేని దయనీయ స్థితిలో వాటిని వ్యతిరేకిస్తుందని ఆరోపించారు.

27 Oct 2026|05:56 PM IST|Sircilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261027-000019

You're all caught up ✨

Back to latest feed