IV3 NEWS
IV3 NEWS
ప్రతి దృశ్యం, సమాజ హితం
Sign in
సిరిసిల్ల కాంగ్రెస్లో గౌడ్ అన్నలకు అన్యాయం నామినేటెడ్ పదవులలో మొండిచేయి
IV3 NEWS
Local News
IV3 NEWS
krishnadaram198
Reporter
Sirisilla • రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల కాంగ్రెస్లో గౌడ్ అన్నలకు అన్యాయం నామినేటెడ్ పదవులలో మొండిచేయి

సిరిసిల్ల కాంగ్రెస్‌లో గౌడన్నలకు అన్యాయం?

నామినేటెడ్ పదవులు, రాజకీయ ప్రాధాన్యతలో మొండిచేయి!

రాజన్న సిరిసిల్ల జిల్లా:

సిరిసిల్ల నియోజకవర్గ రాజకీయాల్లో గౌడ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకుంటున్నాడు అన్న సామెత సిరిసిల్ల కాంగ్రెస్ రాజకీయాలకు అద్దం పడుతోందని గౌడ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత 10 నుంచి 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, కేసులు, జైలు జీవితాలను సైతం లెక్కచేయకుండా పార్టీ జెండాను మోస్తూ, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసిన గౌడ నాయకులకు నేటికీ తగిన గుర్తింపు లభించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పార్టీ కోసం ఇన్నేళ్లుగా కష్టపడిన నాయకులకు నామినేటెడ్ పదవులు అందని ద్రాక్షగా మారాయని, జిల్లా స్థాయి పదవుల విషయంలోనూ తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని గౌడ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఒక్క వార్డు టికెట్ కూడా గౌడ సామాజిక వర్గానికి కేటాయించకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌లలో కూడా గౌడలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.పి

ప్రస్తుతం వెలువడనున్న మార్కెట్ కమిటీ, పీఏసీఎస్‌ నియామకాల్లోనైనా డైరెక్టర్ పదవులు దక్కుతాయని ఆశించిన గౌడ నాయకులకు నిరాశే ఎదురవుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

ఎన్నికలు వచ్చినప్పుడే గౌడ సామాజిక వర్గం గుర్తుకు వస్తుందా? ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మా సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుని, పదవులు కేటాయించే సమయంలో మాత్రం పక్కన పెడతారా? అంటూ గౌడ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తమ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని గౌడ నాయకులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గౌడ సామాజిక వర్గం ఆవేదనను గుర్తించి న్యాయం చేస్తుందా? లేక ఈ అసంతృప్తి మరింత తీవ్రమై ఉద్యమ రూపం దాల్చుతుందా? అనేది వేచి చూడాలి.

సిరిసిల్ల కాంగ్రెస్ రాజకీయాల్లో గౌడ సామాజిక వర్గానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో చూడాలి

03 Nov 2026|03:09 PM IST|Sirisilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261103-000031

You're all caught up ✨

Back to latest feed