IV3 NEWS
IV3 NEWS
ప్రతి దృశ్యం, సమాజ హితం
Sign in
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి!*  *హేతుబద్దీకరణ జీవో 25 ను సవరించాలి*  *సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి*  *PRC ప్రకటించి అమలు చేయాలి*
IV3 NEWS
Local News
IV3 NEWS
krishnadaram198
Reporter
Sirisilla • రాజన్న సిరిసిల్ల

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి!* *హేతుబద్దీకరణ జీవో 25 ను సవరించాలి* *సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి* *PRC ప్రకటించి అమలు చేయాలి*

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF )రాజన్న సిరిసిల్ల జిల్లా లోని సిరిసిల్ల మండలం సభ్యత్వాల సేకరణ లో భాగంగా లో జిల్లాఅధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలనే ప్రభుత్వ ఉత్తర్వు 25ను వెంటనే సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలకు తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయించి, ప్రతి తరగతికి ఒక గదిని నిర్మించి , పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వారికి సమాన పనికి సమాన వేతనం అందించాలని ఉద్యోగులకు రావలసిన అన్ని హక్కులను వారికి కల్పించాలని డిమాండ్ చేశారు..

పిఆర్సి కమిషన్ వేసి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికీ పి అర్ సి నివేదికను తెప్పించుకోకపోవడం , ఫిట్మెంట్ ప్రకటించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని 50 శాతం ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పెన్షనర్ల, టీచర్ల వివిధ రకాల పెండింగు బిల్లులను విడుదల చేయాలన్నారు. . ఉపాధ్యాయులకు పాఠశాల పని వేళల్లో వివిధ రకాల శిక్షణలు, ఆన్లైన్ యాప్ పనులు, బోధ నేతర పనులు అప్పగించడం వల్ల ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతున్నారని, దీనివల్ల విద్యార్థులలో విద్యా నాణ్యత లోపిస్తుందని తెలిపారు. ప్రభుత్వం పాఠశాల పనివేళలో ఇబ్బడిముబ్బడిగా నిర్వహిస్తున్న శిక్షణలను, ఆన్‌లైన్‌ పనులను వెంటనే నిలిపివేయాలని కోరారు.ఉపాధ్యాయుల ఏకీకృకృత సర్వీసు రూల్స్ రూపొందించి ఖాళీగా ఉన్న మండల విద్యాధికారుల మరియు డిప్యూటీడిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు నిర్వహించాలని కోరారు.

2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని కోరారు.2024 డిఎస్సి ఉపాధ్యాయులకు తొందరగా ప్రొబేషనరీ డిక్లరేషన్ చేసి వెంటనే రెండవ వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మైలారం తిరుపతి సిరిసిల్ల మండలం అధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ లక్ష్మీనారాయణ రాంప్రసాద్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

30 Oct 2026|10:35 PM IST|Sirisilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261030-000025

You're all caught up ✨

Back to latest feed