విద్యార్థినిని అభినందించి, అండగా ఉంటానని కెటిఆర్ భరోసా
సిరిసిల్ల : ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కలిసిన వంశికను ఆమెను ప్రత్యేకంగా అభినందించి, జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. వంశిక క్రికెట్‌లో సాధించిన విజయాలు, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తీరు, భవిష్యత్తు లక్ష్యాల గురించి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థినులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, వంశికకు అన్ని విధాలా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అక్టోబర్ 10 నుంచి 13వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతో కూడిన ఉమ్మడి జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె, తన నాయకత్వ ప్రతిభతో జట్టును సెమీఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. బౌలింగ్‌లోనూ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకుంది. వచ్చే నవంబర్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక తెలంగాణ తరఫున తన ప్రతిభను చాటనుంది.