అంకిరెడ్డిపల్లెల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రాగుల రాజిరెడ్డి
అంకిరెడ్డిపల్లెలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం గ్రామంలోని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ రాగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాగుల రాజిరెడ్డి మాట్లాడుతూ, రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా గ్రామ స్థాయిలోనే ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యాన్ని కేంద్రానికి తెచ్చే ముందు రైతులు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండేలా ఆరబెట్టుకోవాలని, తద్వారా తూకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన ధాన్యం విక్రయించవచ్చని సూచించారు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమ చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిల్ల రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగల రాజు, మహిళా సంఘ అధ్యక్షురాలు తొత్తల గాయత్రి, ఏపీఎం చందు, సీఏ విట్టల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పొన్నల పరశురాం, వార్డు సభ్యులు ఎలుకపల్లి జ్యోతి, సింగిరెడ్డి అనసూయ, పోచంపల్లి రంగయ్యలతో పాటు మండల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.