ఫోక్ సాంగ్ ప్రోమోను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ లు
ఈరోజు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి చేతుల మీదుగా రింగు రింగు గోల్డ్ రింగు అని ఫోక్ సాంగ్ ప్రోమో ను విడుదల చేయడం జరిగింది..
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ... సిరిసిల్ల కళలకు పుట్టినిల్లు లాంటిది ఈ ప్రాంతం నుండి ప్రముఖ కవి రచయిత సినారె గారు తన రచనల ద్వారా ఎంతో ఖ్యాతిని సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచారు ఇలాంటి ఎంతోమంది తమ రచనలు పాటల నాట్యం ఇలా వివిధ కళల ద్వారా మంచి పేరు సాధించి మన ప్రాంతానికి కళాత్మక రంగంలో గొప్ప పేరు తీసుకువచ్చారు..
మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కళా రంగంలో విశిష్ట సేవలు అందించిన మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో కళాకారులు కళా అభిమానులు ముందుకు వచ్చి మరిన్ని సంస్కృతిక సాంప్రదాయ, జానపద, నృత్యము లలో మంచి ప్రతిభతో మంచి సందేశం తో కూడిన కొత్త కొత్త పాటలను చిత్రీకరించాలని కోరుకుంటున్నామని అన్నారు...
నేడు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఫోక్ ఇండస్ట్రీలో ఎంతోమంది తమ ప్రతిభను ప్రదర్శించి తక్కువ సమయంలోనే ఎంతో విలువైన ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్నారు అందులో భాగంగా ఈరోజు ఇంత చక్కటి ఫోక్ సాంగ్ ను చిత్రీకరించిన ప్రకాష్ కు ఇందులో చక్కగా నటించిన రామ్ కు , హర్షిత కు ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాం అని ఈ సందర్భంగా అన్నారు..
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ప్రకాష్ , నటీనటులు రామ్, హర్షిత లను మున్సిపల్ చైర్ పర్సన్ గారు పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారు, విప్ బుర్ర మల్లికార్జున్ గారు, కౌన్సిలర్ సభ్యుల బుర్ర నారాయణ గౌడ్ గారు, గుడ్ల శ్రీనివాస్ గారు, ఎలుక వెంకటేశం గారు, లింగంపల్లి గంగరాజు గారు, అడిచెర్ల రూప సాయి కృష్ణ గారు, బత్తుల రమేష్ గారు, రిక్కమల్లె రజిత సంపత్ గారు, రింగు రింగు గోల్డ్ రింగు పాట చిత్రీకరణ బృందం వారు, మొదలగు పుర ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొన్నారు..