IV3 NEWS
krishnadaram198
Reporter
Sirisilla • రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల: నవంబర్ 3న రాష్ట్రస్థాయి జానపద కార్యక్రమం
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో తెలుగు ఫోక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కన్వీనర్ ఎండీ సత్తార్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రముఖుల సూచనల మేరకు రాష్ట్రస్థాయి జానపద ఆవిర్భావ కార్యక్రమాన్ని నవంబర్ 3వ తేదీ మంగళవారానికి మార్చినట్లు తెలిపారు. పట్టణ ప్రజలు, జానపద కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్తార్ బాయి పిలుపునిచ్చారు.
25 Oct 2026|01:05 PM IST|Sirisilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261025-000015