IV3 NEWS
krishnadaram198
Reporter
Sirisilla • రాజన్న సిరిసిల్ల
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ విజ్ఞప్తి
తెలంగాణలో సామాజిక న్యాయం, బీసీల రాజకీయ సాధికారత, పద్మశాలి–చేనేత కార్మికుల సంక్షేమం కోసం గత దశాబ్ద కాలంగా ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పనిచేస్తున్న తనకు గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ విజ్ఞప్తి చేశారు. బీసీలకు శాసనమండలిలో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అట్టడుగు వర్గాల సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించే అవకాశం కల్పించాలని కోరారు దాసు సురేష్ తన సామాజిక ఉద్యమ ప్రస్థానం, విద్యార్హతలు, వృత్తిపరమైన అనుభవం, బీసీ సమాజ హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలను వివరిస్తూ తన అభ్యర్థిత్వాన్ని సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
27 Oct 2026|01:44 PM IST|Sirisilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261027-000018