IV3 NEWS
IV3 NEWS
ప్రతి దృశ్యం, సమాజ హితం
Sign in
కొనరావుపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
IV3 NEWS
Local News
IV3 NEWS
VIGNYATHRI IRUKULLA
VIGNYATHRI IRUKULLA
Reporter
Sircilla • రాజన్న సిరిసిల్ల

కొనరావుపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా బుధవారం రోజున కొనరావుపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ...వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా బాధ్యతగా మెలగాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని,విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి పరిశీలించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థపై అధికారులు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని, స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టుల వంటి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో. పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని,డయల్ 112 కు కాల్ రాగానే పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ రవికుమార్, ఎస్.ఐ రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.

21 Oct 2026|01:28 PM IST|Sircilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261021-000006

You're all caught up ✨

Back to latest feed