నిరుపేద యాదవ కుటుంబానికి ఇచ్చిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలి
నిరుపేద యాదవ కుటుంబానికి ఇచ్చిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలి పెద్దలింగాపురంలో 150 యాదవ కుటుంబాలకు గొర్రెల షెడ్లు నిర్మించాలి! యాదవుల పోరాట సమితి రాష్ట్ర శాఖ డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుపేద యాదవ కుటుంబానికి గొర్రెల షెడ్డు తొలగించాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ యాదవుల పోరాట సమితి రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని సమితి నాయకులు పేర్కొన్నారు. పెద్దలింగాపురం గ్రామంలో నివసిస్తున్న సుమారు 150 యాదవ కుటుంబాలకు మూడు ఎకరాల స్థలం కేటాయించి, గొర్రెల షెడ్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొక్కు దేవేందర్ యాదవ్ అధ్యక్షుడు తెలంగాణ యాదవ సంఘ హక్కుల పోరాట సమితి ,శ్రీశైలం యాదవ్ ,వేణు ,శ్రీను ,వంశీకృష్ణ,ఎల్లం,దేవరాజు,అశోక్,
శ్రీనివాస్ యాదవ్ ,మల్లేశం,రాములు యాదవ్,మల్లేశం యాదవ్ ,అజయ్