IV3 NEWS
IV3 NEWS
ప్రతి దృశ్యం, సమాజ హితం
Sign in
సామాజిక సేవలో భాగంగా కొందరికైనా ఉచిత వైద్యం చేయాలి - జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
IV3 NEWS
Local News
IV3 NEWS
VIGNYATHRI IRUKULLA
VIGNYATHRI IRUKULLA
Reporter
Sircilla • రాజన్న సిరిసిల్ల

సామాజిక సేవలో భాగంగా కొందరికైనా ఉచిత వైద్యం చేయాలి - జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల : వైద్య కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు డాక్టర్లుగా ఉత్తమ వైద్య సేవలు అందించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో "వైట్ కోట్ సెర్మనీ" శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు వైద్య విద్యార్థులకు వైట్ కోట్ లు అందజేసి అభినందించారు. అనంతరం నిర్వాహకులు జిల్లా కలెక్టర్, ఎస్పీని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సమాజంలో వైద్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు. వైద్య విద్య అభ్యసించేందుకు చాలా కష్ట పడాల్సి ఉంటుందని, వైద్యుల సేవలు చాలా కీలకమని స్పష్టం చేశారు. గర్భిణులు, పిల్లలు, వివిధ రోగాలతో బాధ పడే వారికి వైద్యులు ఎంతో ఓపికతో సేవలు అందిస్తారని కొనియాడారు. వైద్యులు తాము ఎంచుకున్న విభాగంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో భాగంగా వైద్యులు కొందరికైనా ఉచిత వైద్య సేవలు అందించాలని సూచించారు. దీంతో ఆత్మ సంతృప్తి ఉంటుందని తెలిపారు. వైద్యం, సేవల్లో మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు. సిరిసిల్ల వైద్య కళాశాల, బాలికల, బాలుర హాస్టల్ నిర్మాణ పనులను తాను పలుమార్లు సందర్శించానని గుర్తు చేశారు. ప్రస్తుతం బాలికల హాస్టల్ వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. మెడికల్ కాలేజీ, బాలుర హాస్టల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. త్వరలోనే వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ నిర్విష, తహసీల్దార్ మహేష్ కుమార్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

24 Oct 2026|02:00 PM IST|Sircilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261024-000012

You're all caught up ✨

Back to latest feed