IV3 NEWS
IV3 NEWS
ప్రతి దృశ్యం, సమాజ హితం
Sign in
తెలంగాణ భవన్ లో ఘనంగా కొమరం భీం జయంతి వేడుకలు
IV3 NEWS
Local News
IV3 NEWS
krishnadaram198
Reporter
Sirisilla • రాజన్న సిరిసిల్ల

తెలంగాణ భవన్ లో ఘనంగా కొమరం భీం జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో కొమరం భీమ్ జయంతి వేడుకలు కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన రాజన్న సిరిసిల్ల జిల్లా BRS పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు మరియు నాఫ్కప్* *చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఈ సందర్భంగా ఆగన్న మాట్లాడుతూ, “జల్, జంగల్, జమీన్” నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన త్యాగం, ధైర్యం, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బూర బాలు, మొగిలి నాగరాజు,ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, తంగళ్లపల్లి మండల అధ్యక్షులు గజాబింకర్ రాజన్న,మాజీ ఎంపిపి చంద్రయ్య గౌడ్ అమర్ రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

22 Oct 2026|01:46 PM IST|Sirisilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261022-000008

You're all caught up ✨

Back to latest feed