సురక్షిత్ బచ్పన్ అభియాన్ లో బాగంగా న్యాయ అవగాహన సదస్సు
సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలోని మహత్మా జ్యోతిబా పులే బి.సి. వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బాల, బాలికల రక్షణ కోసం చేసిన ఫోక్సో విద్య హక్కు చట్టం వెట్టిచాకిరి నిరోధ చట్టం బాల కార్మికులు చట్టం బాల్యవివాహాల నిరోధ చట్టం చట్టాలు ఉన్నాయని, భద్రత లేదనిపించినపుడు, పాఠశాలలో గాని బయట ప్రదేశంలో గానీ ఎక్కడైనా ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే ప్రిన్సిపాల్ దృష్టికి తల్లిదండ్రుల దృష్టికి తీసుకుని వెళ్ళాలని విద్యార్థినులకు సూచించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్గించారు. వివిధ హెల్ప్ లైన్ నెంబర్ ల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణ్ చారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సురక్షిత బచ్పన్ అభియాన్ కార్యక్రమం ఈనెల 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థల్లో ప్రతి ఒక్క విద్యార్థికి వారి యొక్క సంరక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయబడిందని . . . ఈ ఒక్కరోజు అవగాహన కల్గించడంతోనే సరిపోదు, నిరంతరం విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్గించే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. పిల్లల ఫిర్యాదు పై స్పందించని వారు కూడా తప్పు చేసిన కిందికి వస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ పోక్సో కోర్ట్ పెంట శ్రీనివాస్ గారు లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, చింతోజు భాస్కర్ , కళ్యాణి, ప్రిన్సిపాల్ సుష్మిత, ఉపాద్యాయినులు పాల్గొన్నారు.