IV3 NEWS
VIGNYATHRI IRUKULLA
Reporter
Sircilla • రాజన్న సిరిసిల్ల
సిరిసిల్లలో వైభవంగా శ్రీ శ్రీశాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
సిరిసిల్ల: పట్టణంలో శ్రీ శ్రీశాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో సందడిగా మారాయి.
21 Oct 2026|12:49 PM IST|Sircilla, రాజన్న సిరిసిల్ల|IV3-20261021-000005